Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Monday, July 25, 2011

వాడేమైనా తమిళ - హిందీ చిత్రాల్లో నటిస్తున్నాడా..?!!


దాసరి నారాయణరావు ఎప్పుడైనా వార్నింగ్‌లు ఇస్తే డైరెక్ట్‌గా ఉంటాయి. కానీ తాజాగా ఆయన తన వార్నింగ్‌‌ను చాలా సున్నితంగా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే... హీరో సిద్దార్థ్‌ '180' సినిమా రిలీజ్‌కు ముందు తన ట్విట్టర్‌లో కొన్ని ఛానళ్ళు గంట ప్రోగ్రామ్‌కోసం తమ కుటుంబాల్ని అమ్ముకుంటున్నారని... ఏదేదో పిచ్చిపిచ్చిగా రాశాడు. ఈ కొటేషన్‌ చూసి అవాక్కయిన తెలుగు సినిమా ఛానళ్లువారు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు.

తెలుగు వారిని అనలేదే: మురళీమోహన్‌
అయితే అదంతా చదివాక 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ తెలుగు ఛానళ్ల గురించి ప్రస్తావించలేదని జర్నరలిస్టులకు నచ్చచెప్పాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఛాంబర్‌ దృష్టికి కూడా తీసుకెళ్ళారు. అయినా చూద్దాం చేద్దాం.. అంటూ సాగదీశారు. దీంతో ఛానళ్ళంతా కలిసి ఆదివారంనాడు దాసరి నారాయణరావుకు ఫిర్యాదు చేశారు.

జాతీయ సమస్య అవుతుంది: దాసరి
సోమవారంనాడు దాసరి ఆయా ఛానళ్ళ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం వారి సమక్షంలోనే ఆయన మురళీమోహన్‌కు ఫోన్‌ చేశారు. మురళీమోహన్‌.. ఆ విమర్శ తెలుగువారిని ఉద్దేశించింది కాదని చెప్పాడు. దాంతో దాసరి... "వాడికి.. తెలుగువారు కాకుండా ఏ భాషలో చిత్రాలు వస్తున్నాయి. ప్రస్తుతం హిందీ, తమిళం చేస్తున్నాడా?" అంటూ ప్రశ్నించారు. దీంతో మురళీమోహన్‌ ఖంగుతిని నీళ్ళు నమిలాడు. ఒకసారి పరిశీలిస్తానని చెప్పాడు.

ఆ తర్వాత దిల్‌రాజుకు ఫోన్‌ చేశాడు. ఆయన తన షూటింగ్‌ నిమిత్తం కేరళలో ఉన్నాడు. ఆ షూటింగ్‌లో హీరో సిద్దార్థ్ పాల్గొంటున్నట్లు తెలిసింది. పైగా దిల్‌రాజు, సిద్దార్థ్‌ మంచి స్నేహితులు. ఇదే విషయాన్ని దిల్‌రాజుకు చెప్పాడు దాసరి నారాయణరావు. తెలుగువారిని కాదని ఆయనా సమాధానం చెప్పాడు. అయితే జాతీయ ఛానళ్ళ వారిని అన్నాడా? అంటూ... భేషరతుగా సిద్దార్థ్‌ క్షమాపణ చెప్పాలని సూచించారు. లేదంటే ఇది జాతీయసమస్యగా మారుతుందని సున్నితంగా హెచ్చరించారు. మరి సిద్దార్థ్ దీని గురించి ఏమంటాడో చూడాలి. ఇప్పటికే సిద్దార్థ్‌ పాల్గొనే ఫంక్షన్లకు ఎలక్ట్రానిక్‌ మీడియా వెళ్లడం లేదు.

No comments:

Post a Comment