నటీనటులు: తనీష్, ఆంచల్, రోజా,శివకృష్ణ, రాజ్యలక్ష్మి, ఎం.ఎస్.నారాయణ, సత్యప్రకాష్, శ్రీధర్ తదితరులు, కెమెరా: సుదర్శన్‌రెడ్డి, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటర్:నాగిరెడ్డి, నిర్మాత: ఎస్.ఎస్. బుజ్జిబాబు, కథ- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: బి.వి.బి చౌదరి.
పాయింట్: ఊరి ప్రెసిడెంట్‌ను ఛాలెంజ్ చేసి వారి అమ్మాయిని పెండ్లి చేసుకునే యువకుడి కథ.
ఈ చిత్రం గురించి చెప్పుకోవడానికి ముందుగా చిత్ర హీరో తనీష్ గురించి చెప్పాలి. క్యూట్‌గా ఉంటూ ప్రేమకథల్లో నటించే కుర్రాడు ఒకేసారి మాస్ ఇమేజ్ కోసం తాపత్రపడడం సాహసమే అని చెప్పాలి. అప్పుడే కాలేజీకి వచ్చిన కుర్రాడు సీనియర్ రౌడీతో ఛాలెంజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈచిత్రంలో హీరో విలన్‌ల మధ్య పోరు అలా ఉంటుంది. కొన్నిచోట్ల బాలకృష్ణ డైలాగ్‌లు గుర్తుకు వస్తాయి.
కథలోకి వెళితే...
ఓ గ్రామంలో అభిమన్యు(తనీష్) దగ్గుబాటి సీతారత్నం(రోజా)కు ఏకైక కొడుకు. ఆమె ఆ ఊరిలో పేరున్న ఆవిడ. అభిమన్యుకి తండ్రి ఎవరో ప్రస్తావన రాదు. పక్కనే ఉన్న మరో ఊరి ప్రెసిడెంట్ శివకృష్ణ కుమార్తె నందిని(ఆంచల్). అభిమన్యు ధైర్యసాహసాలు చూసి మనసు పారేసుకుంటుంది. తనీష్ తల్లిదండ్రులు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు.
కానీ, నందిని తండ్రి ఊరి ప్రెసిడెంట్ కనుక.. అసలు మీ తల్లి నిన్ను సరిగ్గా పెంచలేదంటూ... చెడామడా తిట్టేసి.. ప్రేమకు అడ్డు పడతాడు. దాంతో అభిమన్యు అహం దెబ్బతిని నువ్వు ప్రెసిడెంట్ అని విర్రవీగుతున్నావ్. ఆ ప్రెసిడెంట్ పోస్టే లేకుండా చేస్తానని సవాల్ విసిరి చివరికి నందినిని ఎలా తనదాన్ని చేసుకున్నాడనేది కథ.
తనీష్‌కు ఈ చిత్ర కథ భారంగా ఉంది. మాస్ ఇమేజ్‌లో కొట్టుకుపోవాలని తాపత్రయంతో ముందుగానే అడుగువేసి అభాసుపాలయ్యాడనే చెప్పాలి. విలన్, హరోల మధ్య జరిగే వాగ్వాదంలో తేలిపోయాడు. ఒకప్పుడు లవ్ చిత్రాలు చేసేవాళ్ళు మాస్ కోసం తాపత్రయపడి ఫెయిలయ్యారు. తరుణ్ ఆ కోవలో చెప్పకోవచ్చు. ఇక హీరోయిన్‌గా ఆంచన్ కొత్తమ్మాయి. కొన్ని షేడ్స్‌లో బాగున్నా... ఎక్కువశాతం ఆకట్టుకోనేలా లేదు. నటన నామమాత్రమే.
రాజకీయనాయకురాలిలా వచ్చిన తన ఇమేజ్‌ను సినిమాల ద్వారా ఉపయోగించుకున్న నటి రోజా. ఆమె డైలాగ్స్ పరవ్‌ఫుల్‌గా ఉన్నా కథకు సరిపడే విధంగా లేవు. ఇక సత్యప్రకాష్ పాత్ర బాగానే చేశాడు. కానీ మోతాదు మించింది. ఎం.ఎస్. నారాయణ, శివకృష్ణ పాత్రలు రొటీన్‌గా ఉన్నాయి. మిగిలిన పాత్రలు షరా మామూలే.
సంగీతం అనూప్ రూబెన్స్ కష్టపడి పనిచేసినా ఉపయోగం లేదు. రెండు పాటలు వినడానికి బాగున్నాయి. కానీ తెరపై చిత్రీకరణ సరిగ్గాలేదు. సంభాషణపరంగా రచయిత చేసిన తప్పిదం. ఏ డైలాగ్ సరిగ్గా పేలకపోవడమే. కొన్నిడైలాగ్‌లు బాలకృష్ణ చిత్రంలోనివి, కొన్ని ప్రభాస్‌వి, ఇలా రకరకాల హీరోల డైలాగ్‌లు తనీష్ చెప్పేసి అభాసుపాలు చేశాడు. చిత్ర నిర్మాతలు కథలు వినేటప్పుడు జాగ్రత్తగా వింటే బాగుంటుందని ఈ చిత్రం చూశాక అర్థమవుతుంది. దర్శకుడికి పట్టు ఉండాలని ఒకసారి గ్రహించాలి.
కొన్ని సన్నివేశాలు తర్వాత ఏ సీన్ వస్తుందో, దాన్ని ఎలా ముగిస్తున్నాడో అర్థంకాదు. కథలు చెప్పడం వేరు. దాన్ని తెరపై తీయడం వేరు. ఆ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. టైటిల్ కోడిపుంజు ఎందుకన్నారో.. కాసేపు అర్థంకాదు. పందెంకోడి పోటీలో ఎదుర్కొని గెలుస్తుంది. అలాగే హీరో ప్రెసిడెంట్‌ను ఛాలెంజ్ చేసి గెలుస్తాడు. తన కొడుకును కోడిపుంజులా పెంచానని రోజా అంటుంది. అయినా ఇదేమీ టైటిల్‌కు సింక్ కాలేదు. ఏది ఏమైనా సరియైన కథతోపాటు దాన్ని ప్రెజెంటేషన్ చేసే విధానం తెలిస్తే చూడ్డానికి బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా అది ఈ కోడిపుంజులానే ఉంటుంది.
No comments:
Post a Comment