Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....
Showing posts with label Naku O Lover Undi. Show all posts
Showing posts with label Naku O Lover Undi. Show all posts

Tuesday, June 14, 2011

బ్యాంకాక్‌లో 'నాకూ ఓ లవరుంది' పాటల చిత్రీకరణ


కృష్ణుడు హీరోగా మాస్టర్‌ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ సమర్పణలో శ్రీశివపార్వతి కంబైన్స్‌ బేనర్‌పై రూపొందుతున్న 'నాకూ ఓ లవరుంది' పాటలతో సహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. 

ఈ సందర్భంగా నిర్మాత కె.సురేష్‌బాబు మాట్లాడుతూ - ''మేము అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తయింది. ఇటీవల బ్యాంకాక్‌, పటాయలలో హీరో కృష్ణుడు, హీరోయిన్‌ రితికలపై నాలుగు పాటలు చిత్రీకరించాం. ఇప్పటివరకు బ్యాంకాక్‌, పటాయలలో ఎన్నో చిత్రాల పాటలను తీశారు. అయితే మేము ఇప్పటివరకు ఎవరూ చెయ్యని పలు అందమైన, రిచ్‌ లొకేషన్స్‌లో ఈ పాటల్ని చిత్రీకరించాం. కె.ఎం.రాధాకృష్ణన్‌ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. 

హండ్రెడ్‌ పర్సెంట్‌ ఈ ఆడియో పెద్ద హిట్‌ అవుతుంది. పాటలు విన్న ప్రతి ఒక్కరూ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయని ఎప్రిషియేట్‌ చేస్తున్నారు. రాధాకృష్ణన్‌గారు ఇచ్చిన అద్భుతమైన పాటలను ఎంతో అందంగా చిత్రీకరించడం జరిగింది. నిక్సన్‌ నృత్యదర్శకత్వంలో ఈ నాలుగు పాటల్ని తీశాం. ప్రారంభం నుంచే ఈ సినిమాకి మంచి క్రేజ్‌ వచ్చింది. ఈనెలాఖరులో ఈ చిత్రం ఆడియోను భారీ ఎత్తున రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. 

ఆడియో రిలీజ్‌ తర్వాత ఈ చిత్రంపై డెఫినెట్‌గా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరుగుతాయన్న నమ్మకం మాకు వుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. 

కృష్ణుడు, రితిక, ఎం.ఎస్‌.నారాయణ, సురేష్‌, ఆలీ, హేమ, ఉషశ్రీ, గీతాసింగ్‌, మాస్టర్‌ భరత్‌, మున్నా వేణు, శివన్నారాయణ, అనంత్‌, ధనరాజ్‌, ఖడ్గం పృథ్వీ, పొట్టి రాంబాబు, తాగుబోతు రమేష్‌, గుండు హనుమంతరావు, రఘు కారుమంచి నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: రాఘవ టి., పాటలు: లక్ష్మీభూపాల్‌, పెద్దాడమూర్తి, సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్‌, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, ఆర్ట్‌: కృష్ణమాయ, కెమెరా: ఎస్‌.డి.జాన్‌, సమర్పణ: మాస్టర్‌ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ, నిర్మాత: కె.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కె.రామ్‌వెంకి.