హస్తినలో చిరంజీవి ఇమేజ్ చిరు ఇమేజ్ అయిపోయిందనీ, ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు ఊకదంపుడు ప్రచారం చేయడంపై పీఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. అవన్నీ కట్టుకథలనీ, రాష్ట్ర స్థాయిలో తమకు కాంగ్రెస్ పార్టీకి కాస్త గ్యాప్ ఉన్నదనీ, ఢిల్లీలో అధిష్టానం వద్ద అన్నయ్యకు అదే ఇమేజ్ ఉన్నదని చెప్పుకొచ్చారు.
గురువారం రాత్రి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు చిరంజీవి స్వగృహంలో భేటీ అయ్యారు. విలీన సభ గురించి గత కొన్ని నెలలుగా తర్జనభర్జనలు జరుగుతున్న నేపధ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సభ లేకుండా మామూలుగా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని తమ పార్టీ అధినేత భావిస్తున్నట్లు గంటా చెప్పుకొచ్చారు.
ఇదిలావుండగా చిరంజీవికి ప్రాధాన్యత తగ్గలేదని అని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించడాన్ని బట్టే ఆయనకు తగ్గిపోయిందని అర్థమవుతుందని కొంతమంది అప్పుడే పల్లవి అందుకున్నారు. మొత్తమ్మీద చిరుకు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక ఉన్నత పదవిని కట్టబెడితే తప్పించే వారి నోళ్లు మూతపడవన్నమాట.
No comments:
Post a Comment