రితేష్ సిధ్వాని, ఫర్తాన్ అక్తర్ నిర్మాతలుగా జోయా అక్తర్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్, కత్రినా కైఫ్, కల్కి కోయిచ్లిన్, అరియాందా తదితరులు నటించిన "జిందగీ నా మిలేంగి దొబారా" చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ఈ నెల 15వ తేదీన ఎరోస్ ఇంటర్నేషనల్ ద్వారా విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్లను వసూలు చేస్తోంది. కేవలం పది రోజుల్లోనే 108 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిందంటే ఆ సినిమాకు ఎంతటి ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ చిత్రంలో లండన్ గాళ్‌గా కత్రినా కైఫ్ తన సెక్సీ అందాలను చక్కగా కావల్సినంత మేర ఆరబోసింది. ఇక హీరో హృతిక్ రోషన్ తన ఫిజిక్‌ను మరోసారి చూపించాడు. ముగ్గురు కుర్రాళ్లు సెలవుల్లో ఒకరికొకరు కలుసుకున్న సందర్భంలో వారి జీవితాలను ఎలా మార్చిందన్నది ఇతివృత్తం. చిత్రాన్ని దర్శకుడు ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించాడు. ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని బాలీవుడ్ ఫిలిం జనం చెపుతున్నారు.
No comments:
Post a Comment