నటి కాజల్ టాప్ హీరోలతో సక్సెస్‌లో ఉంది. తాజాగా నాగచైతన్యతో 'దడ' చేసింది. అయితే షూటింగ్‌లో ఆమె నాగచైతన్యకు దడ పుట్టింది. మాస్ తరహా చిత్రంలో నాగచైతన్య కొత్తగా చేయడంతోపాటు కొన్ని సన్నివేశాల్లో చికాకు పుట్టించాడని కాజల్ భావించిందట. దాంతో వీరిద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయని ఫిలింనగర్ కథనం.
దీంతో ఇటీవలే జరిగిన 'దడ' ఫంక్షన్‌కు కాజల్ హాజరు కాలేదు. అనారోగ్యం రీత్యా ఆమె హాజరు కాలేదని నిర్మాత వెల్లడించారు. అయితే ఇగో వల్ల ఆమె ఫంక్షన్ రాలేదని తెలిసింది. నాగచైతన్య మాత్రం ఆగస్టు 22న సినిమా విడుదలయితే అవుతుంది. సక్సెస్ అయితే అవుతుంది అన్నట్లు ఇంట్రస్ట్ లేనట్లుగా మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎందుకలా మాట్లాడాడో తెలియలేదు. నిర్మాత మాత్రం... నాగేశ్వరరావు నుంచి నాగార్జున చిత్రాలను ఉటంకిస్తూ అన్నీ దడ దడ.. నాగచైతన్య చిత్రం కూడా దడ సృష్టిస్తుందని అన్నాడు. మరి నాగచైతన్యకు మాస్ అప్పీల్ సూటవుతుందో లేదో చూడాలి.
No comments:
Post a Comment