
ముఖ్యంగా తనకంటే ముందే రాంగోపాల్ వర్మకు భానుకిరణ్‌తో మంచి సంబంధాలున్నాయని కల్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది. బెయిల్ పై విడుదలైన కల్యాణ్ మొత్తం వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. రక్తచరిత్ర సినిమా తీసే సమయంలో వర్మతోపాటు భాను లోకేషన్స్ ఎంపిక కోసం కలిసి వెళ్లేవాడని వివరించాడు.
అప్పటికే వర్మతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్న భానుతో తనకు పరిచయం ఏర్పడి, దాని ద్వారా హైదరాబాదులో పలు సెటిల్మెంట్లు చేశామని కల్యాణ్ ఒప్పుకున్నాడు. అంతేకాదు 2009లో ఓసారి భానుకిరణ్ స్వయంగా తనను సూరి వద్దకు తీసుకెళ్లాడనీ, అప్పుడు సూరి తనతో రక్తచరిత్ర సినిమా గురించి తనతో చర్చించారని వెల్లడించాడు. ఆ తర్వాత సూరి నిమ్స్‌లో ఉన్నప్పుడు శింగనమలతో కలిసి వెళ్లి సూరిని చూసి వచ్చామని కల్యాణ్ చెప్పాడు.
No comments:
Post a Comment