Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, July 26, 2011

లండన్ మ్యూజియంలో చమేలీ మైనపు బొమ్మ!!



బాలీవుడ్ సుందరాంగి కరీనా కపూర్ మైనపు బొమ్మ లండన్ మ్యూజియంలో ఇకపై కనువిందు చేయనుంది. అయితే, ఈ ముద్దుగుమ్మ మైనపు ప్రతిమ ఎలాంటిది ఉంచాన్న అంశంపై మేడమ్ టూసౌండ్స్ లండన్ మ్యాజియం నిర్వాహకులు గత కొంతకాలంగా తర్జనభర్జనలు పడుతూ వచ్చి చివరకు చమేలీ చిత్రంలో ఒక గెటప్‌లో ఉన్న కరీనా కపూర్ మైనపు ప్రతిమను రూపొందించిన అక్కడ ఉంచాలని నిర్ణయించారు. 

ఈ మైనపు ప్రతిమను ప్రతిష్టించడం ఎపుడెపుడా అని అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తూ వచ్చారు. చివరకు ఆ సమయం రానే వచ్చింది. నిర్వాహకులు ఒక నిర్ణయానికి రావడంతో ఈ సమయం ఆసన్నమైంది. కాగా, చమేలీ చిత్రానికి కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా మనీష్‌ మల్హోత్రా వ్యవహరించారు. ఇపుడు ఆయనే లండన్‌ మ్యాజియానికి కరీనా బాడీ కొలతలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

No comments:

Post a Comment