కత్రినా - సల్మాన్ ఖాన్ కలిసి కనబడితే అది వార్తే. తాజాగా వీళ్లద్దరూ ఓ రియాల్టీ షోకు వచ్చారు. వీరిని చూసిన అక్కడి జనం నివ్వెరపోయారు. ఆ ఆశ్చర్యం నుంచి వారు తేరుకునేలోపే సల్లు-కత్రినా ఇద్దరు మరో పని చేశారు.
రెండు నిమిషాలపాటు గాలి కూడా చొరబడకుండా ఒకరికొకరు గట్టిగా హత్తుకుని విడివడలేదు. ఈ దృశ్యాన్ని చూసినవారు నోరెళ్లబెట్టారు. ఆ అరుదైన కౌగిలి దృశ్యాన్ని క్లిక్‌మనిపించాల్సిన ఫోటోగ్రాఫర్లలో చాలామంది అలా గుడ్లప్పగించి చూడటం తప్పించి కెమెరాలకు పని చెప్పలేదట.
మొత్తమ్మీద కత్రినా - సల్మాన్ బహిరంగంగానే ఇలా కౌగిళ్లు మొదలెట్టారంటే లోలోపల పరిస్థితి ఎందాకా వెళ్లిపోయి ఉంటుందోనని అక్కడివారు గుసగుసలాడుకున్నారట.
No comments:
Post a Comment