![](http://telugu.webdunia.com/entertainment/silverscreen/gossips/1107/13/images/img1110713082_1_1.jpg)
మొన్నామధ్య దాసరిపై కామెంట్ చేసి మీడియాలో "మగధీర" అయిన చెర్రీ ఇటీవల అమెరికాలో జరిగిన నాట్స్ వేడుకల్లో ప్రియమణిపై ఓ సెటైర్ బాణం విసిరాడట.
కార్యక్రమానికి హాజరైనవారంతా ప్రియమణిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి సమాధానాలు రాబట్టుకున్న తదనంతరం చెర్రీ కూడా ప్రియమణిని ఓ ప్రశ్న అడగాలని కోరాడట. అందుకు ప్రియ.. సరే అడగండి అనేసరికి.. మీకు ఫిలిమ్ ఫేర్ అవార్డు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించాడట.
అయితే అడిగే విధానంలో కాస్త వ్యంగ్యం ఉండేసరికి ప్రియమణికి ఎక్కడో మండిందట. దీంతో కొనుక్కుంటే తనకు ఆ అవార్డు వచ్చిందని మంకు సమాధానం చెప్పి అక్కడి నుంచి విసవిస వెళ్లిపోయిందట. ఈ పరిణామంతో "ఏంటి చెర్రీ మరీనూ.." అని అక్కడివారు రాంచరణ్‌తో అన్నారట.
No comments:
Post a Comment