Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Saturday, July 16, 2011

బ్యానా.. గీనా.. ఐ డోంట్ కేర్ అంటోన్న తమన్నా


చెర్రీ, తమన్నా హీరోహీరోయిన్లుగా చేస్తున్న చిత్రం రచ్చ. ప్రస్తుతం ఈ రచ్చ షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. అయితే ఏంటట.. అనంటే, శ్రీలంకలో కోలీవుడ్‌లో నటించే తారలు షూటింగ్‌లో పాల్గొంటే కోలీవుడ్ ఇండస్ట్రీ వారిపై నిషేధం విధిస్తుంది. 

ఎందుకంటే అక్కడి తమిళులపై శ్రీలంక అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కోలీవుడ్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో అసిన్ ఈ నిబంధనను అతిక్రమించడంతో ఆమెపై వేటు పడింది. 

ఇపుడు తమన్నా కూడా "రచ్చ"కోసం శ్రీలంక వెళితే వేటు వేయడం ఖాయమంటున్నారు కోలీవుడ్ సినీజనం. అయితే ఈ వేటులకు తానేమీ భయపడబోనని తమన్నా చెప్పినట్లు భోగట్టా. దానికి కారణం... ఈ మిల్కీ బేబీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో కోటి రూపాయల పారితోషికం ముడుతోంది. పైపెచ్చు మరో మూడు నాలుగేళ్ల దాకా సరిపడే ప్రాజెక్టులు చేతినిండా ఉండటంతో ఈ బ్యాన్లను కేర్ చేసే పరిస్థితిలో తమన్నా లేదట.

No comments:

Post a Comment