Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, June 3, 2011

సునీల్ హీరోయిన్ తో వెంకటేశ్ సినిమా


గతంలో కొన్ని సినిమాలు చేసినా, సునీల్ మర్యాదరామన్నతో టాలీవుడ్ లో తెలుగమ్మాయిగా సలోనికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వెంటనే స్టార్ హీరోల సినిమా అవకాశాలు రాకపోవడంతో… చిన్నా చితకా సినిమాలు చేస్తూ వచ్చింది సలోని. ఇప్పుడు అనుకోకుండా వెంకటేశ్ సరసన నటించే అవకాశం వచ్చింది. బాడీగార్డ్ రీమేక్ లో నటిస్తున్న వెంకటేశ్ ఇందులో ఓ హీరోయిన్ గా త్రిషను సెలక్ట్ చేసుకున్నాడు. మరో హీరోయిన్ గా ఇటీవలే సలోనికి ఆఫరిచ్చాడు. బాడీగార్డ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకీ మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ కి ఈక్వల్ గా హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసమే సలోని ఎంపికైంది. వెంకటేశ్ తో సినిమా అనేసరికి పండగ చేసుకుంటోంది సలోని.

No comments:

Post a Comment