Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Monday, June 27, 2011

కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోన్న బొమ్మాళీ అనుష్క, దీక్షాసేథ్‌!


కోలీవుడ్‌లో అందాల భామలు అనుష్క, దీక్షాసేథ్‌లు తెగ బిజీబీజీగా ఉన్నారు. చేతినిండా సినిమా కాల్షీట్లతో దీక్షా, బొమ్మాళీలు బిజీబిజీగా షూటింగ్‌‌లలో గడుపుతున్నారు.

"యముడు" సినిమా (తమిళంలో సింగం)తో కోలీవుడ్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న అరుంధతి అనుష్క.. సూర్య తమ్ముడు, త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న ఆవారా హీరో కార్తీక్‌ సరసన నటించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో బొమ్మాళీ గ్లామర్ రోల్ ప్లే చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

యముడులో సూర్యతో అందచందాలను ఆరబోసిన అనుష్క త్వరలో సూర్య తమ్ముడు కార్తీతోనూ రొమాన్స్ చేయనుంది. ప్రస్తుతం కార్తీ పెళ్లి (జూలై నాలుగో తేదీ) పనుల్లో బిజీబిజీగా ఉండటంతో సినిమా షూటింగ్‌ లేటుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఈ సినిమాపై కోలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి.

ఇకపోతే.. వాంటెడ్, మిరపకాయ్ సినిమాల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ దీక్షాసేథ్ కూడా కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా విలక్షణ నటుడు విక్రమ్ సరసన నటించే సూపర్ ఛాన్స్‌ను దీక్షాసేథ్ కొట్టేసింది. ఇదేకాకుండా పొడవుకాళ్ల సుందరి దీక్షాసేథ్ సరసన నటించేందుకు తమిళ హీరోలు కూడా ఎగబడుతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.

No comments:

Post a Comment