WD
ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ చిత్రాలతో వరుసగా రెండు హిట్ కొట్టిన కరణాకరన్ దర్శకత్వం వహించే చిత్రంలో రామ్, తమన్నాలు జంటగా నటించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. అంతేకాదు సినిమా టైటిల్ కూడా "ఎందుకంటే .. ప్రేమంట" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రామ్ ఓన్ బేనర్ స్రవంతి మూవీస్ పతాకంపై కరుణాకరన్ మార్క్ పొయెటిక్ ఫిల్మ్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం తమన్నా హీరోయిన్‌గా ఎంపికైంది.
ఇప్పటికే 100% లవ్, బద్రినాథ్‌లతో తెలుగు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న తమన్నా, తాజాగా రామ్‌తో తెరకెక్కే ఎంటర్‌టైనింగ్ లవ్‌స్టోరీ "ఎందుకంటే... ప్రేమంట"లో రొమాన్స్ చేయనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఈ చిత్రంలో తమన్నా స్కిన్ షో, గ్లామర్‌గా కనిపించనుందని తెలిసింది. ఇంకేముంది.. తమన్నా అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు పండేగ పండగ.
No comments:
Post a Comment