సింహా చిత్రం తర్వాత హీరోయిన్‌గా నటించేందుకు కాస్త ఒళ్లు తగ్గించిన నమితకు అసలు ఆఫర్లు రావడమే కరువయ్యాయి. దీనికి కారణం ఏంటో అర్థం కాకా చాన్నాళ్లు మధనపడిందట నమిత. ఇటీవల తను ఓ షూటింగ్‌లో పాల్గొంటుండగా అభిమానులు నమిత వద్దకు వచ్చి... "మీరు బొద్దుగా ఉంటేనే బావుంటారు. సన్నగా ఉంటే చూడబుద్ది కావడం లేదు" అన్నారట.
అభిమానుల మాటల వెనుక అర్థాన్ని గ్రహించిన నమిత మళ్లీ తన అందాలను భారీగా పెంచేసే పనిలో పడిందట. ఇపుడీ అందాలతో పచ్చిమిరకాయ్ చిత్రంలో హాట్ మిరపకాయ్‌లో దర్శనమిస్తోంది.
పచ్చిమిరపకాయ్ చిత్రంకోసం నీటిలో జలకాలాడుతూ ఆమె ఇచ్చిన ఫోజులను చూసిన అభిమానులు పచ్చిమిరపకాయ్ ఎపుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తన బొమ్మలకు వస్తున్న ఆదరణను చూసిన నమిత తన అందాలను ఇంకా అపరిమితంగా పెంచాలని భావిస్తున్నదట.
No comments:
Post a Comment