Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Thursday, June 16, 2011

రహస్యంగా నాగ చైతన్య- అనుష్కల నిశ్చితార్థం!?


యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుడు యువహీరో నాగ చైతన్య, అందాల నటి అనుష్కలకు రహస్యంగా నిశ్చితార్థం రహస్యంగా జరిగినట్టు తమిళ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. ఇది అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

ఈ నిశ్చితార్థంతో పాటు వివాహానికి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు ఆ పత్రికా కథనం పేర్కొంది. తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో చక్కటి నటన, అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన అనుష్క తాను ప్రేమలో పడినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. 

అయితే, ఆ వ్యక్తి పేరు.. మాత్రం ఇప్పుడే చెప్పనని, చెబితే అందరూ ఆశ్చర్యపోతారని అన్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉండటంతో రెండేళ్ల తర్వాత పెళ్లి ఉంటుందని చెప్పారు. ఆమె నర్మగర్భ వ్యాఖ్యలపై ఆరా తీసే పనిలో సినీ వర్గాలు పడ్డాయి. 

తొలుత ఆ జాబితాలో 'వేదం' చిత్ర దర్శకుడు క్రిష్‌గా వదంతులు వచ్చాయి. అయితే అనుష్క 'డ్రీమ్ బాయ్' ఆయన కాదని తేలిపోయిందని, తాజాగా ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు, యువ నటుడు నాగ చైతన్య పేరు తెరపైకి వచ్చిందని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది.

No comments:

Post a Comment