Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Thursday, January 26, 2012

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పై రోజుకో రూమర్


వెంకటేష్, మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం పై రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది. తాజాగా ఈ చిత్రం హిందీలో వచ్చి విజయవంతమైన కభి ఖుషీ కభి గమ్ చిత్రం ప్రీమేక్ అని,తెలుగు నేటివిటికి అణుగుణంగా కథను మార్చి తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ హిందీ చిత్రం కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే కథ కావటంతో ఇదే చిత్రం కథని కొద్దిగా మార్చి తీస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక మహేష్ పాత్ర ఆ చిత్రంలో హృతిక్ ని పోలి ఉంటుందని,వెంకటేష్ పాత్ర షారూఖ్ ని,ప్రకాష్ రాజ్ పాత్ర అమితాబ్ కి పోలికతో ఉంటుందని రూమర్స్ అంతటా వినపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.

సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్ ఈ చిత్రం కోసం పాటలను ఆల్రెడీ సిద్దం చేసారు. అతను శ్రీకాంత్ గత చిత్రం కొత్త బంగారు లోకం కోసం కూడా సంగీతం అందించారు. అప్పట్లో ఆ పాటలు మంచి క్రేజ్ ని క్రియోట్ చేసాయి. ఇక అనంత శ్రీరామ్ ఈ చిత్రానికి పాటలు రాస్తున్నారు. మహేష్ బాబు ఫేవెరెట్ కెమెరామెన్ గుహన్ ఈ చిత్రానికి కెమెరా అందించనున్నారు. గుహన్ ఇంతకుముందు అతడు,దూకుడు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. అలాగే ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిసీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం అని కాన్సెప్టు తో నిర్మితమవుతోందని దిల్ రాజు చెప్తున్నారు.

No comments:

Post a Comment