Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Saturday, January 28, 2012

డైలాగులు ఉండకపోతే ‘బిజినెస్ మేన్’లేదు : మహేష్


ఇటీవల విడుదలైన మహేష్ బాబు తాజా సినిమా ‘బిజినెస్ మేన్’ సినిమాలో పలు అభ్యంతరాలు ఉన్న సంగతి తెలిసిందే. భజ్రంగ్ దళ్ కార్యకర్తలు ఈ సినిమాలోని ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ పాటపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సినిమాలో అభ్యంతరకర డైలాగులు(బూతులు), అశ్లీల సన్నివేశాలపై సెన్సార్ బోర్డు కత్తెర వేసింది కూడా. అలాంటి డైలాగులు వినపడకుండా చేయడంతో పాటు, కొన్ని చోట్ల అశ్లీల సన్నివేశాలు కనిపించకుండా మాస్క్ వేసి కవర్ చేయించింది.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు మాట్లాడుతూ....‘‘చిత్రంలో కొన్ని సన్నివేశాలు కొంతమందికి నచ్చకపోయినా కథానుసారం అలా చేయవలసి వచ్చింది. అలా కొన్ని ఘాటైన డైలాగులు పెట్టి ఉండకపోతే ఇవాళ బిజినెస్‌మేన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేదికాదు. అయినా ప్రతిచోటా ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తూనే ఉంది’’ అని చెప్పుకొచ్చారు. తన కెరీర్లోనే బిజినెస్ మేన్ పెద్ద హిట్ గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా క్రెడిట్ అంతా దర్శకుడు పూరి జగన్నాథ్ కే దక్కుతుంది. ఆయన డైరెక్షన్, స్క్రిప్టు, డైలాగులు అద్భుతం ఉన్నాయి కాబట్టే సినిమా హిట్టయిందన్నారు.

ప్రస్తుతం ‘బిజినెస్ మేన్’ వియానందాన్ని ఆస్వాదిస్తున్న మహేష్ బాబు....ఫిబ్రవరి 9 నుంచి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్ర షూటింగులో పాల్గొనబోతున్నారు. ఇందులో వెంకటేష్-మహేష్ బాబు మల్టీ స్టారర్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి దిల్ రాజు నిర్మాత.

No comments:

Post a Comment