Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, January 31, 2012

‘ఇష్క్’ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా సినిమా రంగంలోని ఫంక్షన్లు, కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. సినీ రంగంలోని ఇతర జనాలతో ఎక్కువగా కలవరు. అయితే హీరో నితిన్ కోసం తన బిహేవియర్ మార్చుకున్నాడు ఈ స్టార్ హీరో. ఫిబ్రవరి 2న జరిగే నితిన్ తాజా సినిమా ‘ఇష్క్’ ఆడియో వేడుకకు హాజరయ్యేందుకు ఒప్పుకున్నాడు. ఆయన చేతుల మీదుగానే ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది. ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ పబ్లిక్ ఫంక్షన్ కు హాజరవుతుండటంతో ఇటు అభిమానుల్లోనూ ఆనందం నెలకొంది.

నితిన్, నిత్య మీనన్ జంటగా రూపొందుతున్న ఇష్క్ మూవీ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి నితిన్ స్వయంగా పాడిన ‘కోడిపాయే లచ్చమ్మది’ పాట సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ చిత్ర విజయంపై అంచనాలు పెరిగి పోయాయి. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై, మల్టీ డైమండ్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి. సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం : అనూప్ రూబెన్స్.

No comments:

Post a Comment