Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, January 31, 2012

రవితేజ ‘నిప్పు’ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్


మాస్ మహారాజా రవితేజ, దీక్షా సేథ్ జంటగా బొమ్మరిల్లు పతాకంపై గుణశేఖర్ దర్శకత్వంలో వైవిఎస్ చౌదరి నిర్మిస్తున్న ‘నిప్పు’ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ...‘‘ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో సూపర్ హిట్టయింది. థమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. అన్ని ఏరియాల్లో ఆడియో సేల్స్ బాగుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. మా బొమ్మరిల్లు బేనర్లో వచ్చిన సినిమాలన్నీ ఆడియో పరంగా చాలా పెద్ద హిట్ అయ్యాయి. నిప్పు ఆడియో విజయవంతాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 3న ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ జరుపనున్నాం. రవితేజ, గుణశేఖర్ ఫస్ట్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ఎక్స్ ట్రార్డినరీగా వచ్చింది. తప్పుకుండా ఈ చిత్రం అన్ని వర్గా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 17న మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు.

రవితేజ, దీక్షా సేథ్, డా. రాజేంద్ర ప్రసాద్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, ముకుల్ దేవ్, బ్రహ్మాజీ, సుప్రీత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఆకుల శివ, శ్రీధర్ సీపన, సంగీతం: థమన్, సినిమాటో గ్రఫీ: సర్వేష్ మురారి, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: గౌతం రాజు, ఫైట్స్: కనల్ కణ్ణన్, డాన్స్: రాజు సుందరం, బృంద, గణేష్ తరుపాయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. ఆర్. కిషోర్, కో ఫ్రొడ్యూసర్: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వైవిఎస్ చౌదరి, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుణశేఖర్.

No comments:

Post a Comment