Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Saturday, January 28, 2012

పవన్ కళ్యాణ్‌ జీవితంలో ఈ రోజు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ రోజు పవర్ స్టార్ పెళ్లి రోజు. జనవరి 28, 2009న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మూడు ముళ్ల ద్వారా ఏకమైన రోజు. బద్రి చిత్రం సమయంలో ఏర్పడిన పరిచయం ఇద్దరిని దగ్గర చేసింది. దీంతో పెళ్లికి ముందు నుంచే సహజీవనం మొదలు పెట్టారు. 2004లోనే వీరికి అబ్బాయి జన్మించాడు. తన ఫెవరేట్ దర్శకుడు అకీరా కురసోవా(జపాన్)పై ఇష్టంతో తన కుమారుడికి ‘అకీరా నందన్’ అని నామకరణం చేశాడు పవన్. అకీరా సమక్షంలో వీరి పెళ్లి జరుగడం మరో విశేషం. పెళ్లి తర్వాత 2010లో ఈ జంట మరో పాపాయికి జన్మనిచ్చారు. ఆమెకు ‘ఆద్య’గా నామకరణం చేశారు.

పవన్ కళ్యాణ్ అసలు పేరు కొనిదెల కళ్యాణ్ బాబు. సినిమాల్లోకి రాక ముందు మార్సల్ ఆర్ట్స్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి పలు ప్రద్శనలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనకు ‘పవన్(హనుమాన్)’ అనే బిరుదు వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్‌గా పాపులర్ అయ్యారు. ‘తమ్ముడు’ తదితర చిత్రాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా తన మార్షల్ ఆర్ట్స్ ను ప్రదర్శించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హారిష్ శంకర్ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. జల్సా హిట్ తర్వాత పులి, పంజా సినిమాలు ఘోర పరాజయం పాలవ్వడంతో విజయానికి మొహం వాచి పోయిన పవన్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంపైన భారీ ఆశలు పెట్టుకున్నారు.

No comments:

Post a Comment