Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Saturday, January 28, 2012

వెంకటేష్ నుంచి చాలా నేర్చుకోవాలి


వెంకటేష్-మహేష్ బాబు జంటగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి, మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్లు నటిస్తున్నారు. శ్వేత బసు ప్రసాద్ ఈ ఇద్దరు హీరోల ముద్దుల చెల్లెలుగా, అమల పాల్ మరదలి పాత్రలో కనిపించనున్నారు.

చాలా రోజుల తర్వాత మహాష్ బాబు ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.....‘‘నా రాబోయే చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరవుతా. వెంకటేష్‌లాంటి సీనియర్‌ నటుడినుండి నేను చాలా నేర్చుకోవాల్సి ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు ఇటీవల నటించిన ‘దూకుడు’, ‘బిజినెస్ మేన్’ సినిమాలు వరుసగా విజయవంతం అవ్వడమే కాకుండా....ఇండస్ట్రీ టాప్ గ్రాసర్లలో చోటు దక్కించుకున్నాయి. ఈ వరుస భారీ విజయాలతో మహేష్ బాబు నెం.1 టాలీవుడ్ స్టార్ అనే ప్రచారం జోరందుకుంది. అయితే మహేష్ బాబు మాత్రం తనకు నెంబర్ గేమ్ పై ఆసక్తి లేదని, కష్టపడి పని చేయడం మాత్రమే తనకు తెలుసు అని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment