Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Saturday, January 28, 2012

ప్రజారాజ్యం ఎమ్మెల్యేల పక్క చూపులు తెలుగుదేశం, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో టచ్ లో


ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా మెగాస్టార్ చిరంజీవి పార్టీని, పార్టీ ఎమ్మెల్యేలను పరిరక్షించుకోవలసిన బాధ్యత నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్యలకు మంత్రి పదవులు ఇప్పించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇప్పుడు మరికొన్ని కొత్త చిక్కులు వస్తున్నాయని
చెబుతున్నారు. అవి చిరంజీవికి నేరుగా ఇబ్బంది కాకపోయినా, ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారన్న ప్రచారం ఆయనను కాస్త ఇరుకున
పడవేయవచ్చు. మంత్రి పదవిని ఆశించిన కొందరు ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు కాస్త నిరాశకు గురై చిరంజీవిపట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో ఇప్పటికే ఇద్దరు
ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో టచ్ లో ఉన్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.అలాగే మరికొద్ది మంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు కూడా దృష్టి సారించారని ,ముందుగానే తమ సీట్లను రిజర్వు చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఇప్పటికే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. రెండువేల పద్నాలుగుఎన్నికలలో తమకు టిక్కెట్లు ఇచ్చేటట్లయితే టిడిపిలోకి రావడానికి అభ్యంతరం లేదని కొందరు రాయబారం నడుపుతున్నారట. వారిలో ఒకరిద్దరు గంటాకు మంత్రి పదవి రావడంపైఆగ్రహంతో ఉన్నారు. అయితే టిడిపికి ఆయా నియోజకవర్గాలలో బలమైన నాయకులు ఉంటే వీరికి టిక్కెట్ ఇవ్వడం కష్టమని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒకఎమ్మెల్యేకు టిక్కెట్ హామీ లభించిందని టిడిపి నేత ఒకరు అన్నారు.విశేషం ఏమిటంటే ప్రజారాజ్యం తరపున గత ఎన్నికలలో గెలిచినవారిలో ఎక్కువమంది ఆయా పార్టీల నుంచి
వెళ్లినవారే. ఉదాహరణకు గంటా శ్రీనివాసరావు, వంగా గీత, బండారు సత్యానందరావు, శోభా నాగిరెడ్డి , సి.రామచంద్రయ్య వంటివారు టిడిపిలో వివిధ పదవులు నిర్వహించినవారే. ఈనేఫధ్యంలో ప్రస్తుతానికి అదికారం ఉన్నందున కాంగ్రెస్ లో కొనసాగినా, ఎన్నికలు వచ్చే సమయానికి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస లో ఉంటారా అన్నది సందేహమేనని టిడిపి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

No comments:

Post a Comment