జూనియర్ ఎన్.టి.ఆర్. తెలుగుదేశంకు దూరం అయితే దాని ప్రభావం ఆయన సినిమాలపై కూడా పడుతుందా అన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది.తెలుగుదేశం ముఖ్య నాయకులు కొందరు జూనియర్ ఎన్.టి.ఆర్. ను బెదిరిస్తున్నారని, టిడిపికి దూరం అయితే సినిమా అవకాశాలు తగ్గుతాయని హెచ్చరిస్తున్నారని ఎన్.టి.ఆర్.టిడి.పి అద్యక్షురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంటుందనేది పక్కనబెడితే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇప్పటివరకు జూనియర్ ఎన్.టి.ఆర్.ను తమవాడుగా భావించి ఆయన సినిమాలను ఆదరిస్తున్నారని టిడిపి నాయకులు వాదిస్తున్నారు. అలా అని జూనియర్ ఎన్.టి.ఆర్ నటన చూసి జనం ఆకర్షితులవ్వరని అనడం లేదని, కాని ఒక సినిమా సఫలం అవడానికి దానితోపాటు రాజకీయంగా పార్టీ శ్రేణుల అండ కూడా ఉంటే అది మరింత ఉపయోగం అని, ఒక వేళ నిజంగానే జూనియర్ ఎన్.టి.ఆర్. పార్టీకి దూరం అయితే దాని ప్రభావం కూడా కొంత పడవచ్చన్న చర్చ ఆయనకు దగ్గరగా ఉండేవారిలో కూడా వస్తోంది. అయితే జూనియర్ ఎన్.టి.ఆర్ .సన్నిహితులు మాత్రం జూనియర్ అసలు రాజకీయాలకు కొన్నేళ్లపాటు దూరంగా ఉండాలని భావిస్తున్నారని, పూర్తిగా సినిమారంగంపైనే దృష్టి పెడుతున్నారని చెబుతున్నారు. కాకపోతే ఒకవైపు తండ్రి హరికృష్ణ , మరో వైపు టిడిపి నాయకత్వం మద్య ఏర్పడిన వివాదంలో ఎన్.టి.ఆర్. ఏమీ చెప్పలేకపోతున్నారని, ఈ విషయంలో మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన సన్నిహితుడు ఒకరు వ్యాఖ్యానించారు.మొత్తం మీద జూనియర్ ఎన్.టి.ఆర్ తమతోనే ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో చెప్పినప్పట్టికీ ఆయన ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న మాట నిజమని అంటున్నారు.
No comments:
Post a Comment