Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Saturday, January 28, 2012

అమితాబ్‌బచ్చన్‌ ఒక లెజెండ్గ. ఆయనతో నన్ను పోల్చడం సరికాదు:మహేష్ బాబు


మహేష్‌బాబు సినిమా అంటే.... పోకిరిలా ఉండాలనీ ఫ్యాన్స్‌తోపాటు మహేష్‌ కూడా అనుకున్నాడు. అందులోని బయటపడడానికి చాలాకాలం పట్టింది. 'ఖలేజా' రిలీజ్‌ అయి సక్సెస్‌కు దూరం కావడంతో తాను ఏం చేశాడో అనేది ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకున్నానంటున్నాడు మహేష్‌. రెండేళ్ళ గ్యాప్‌లో చాలా విషయాలు తెలుసుకున్నాననీ... నటనలోనూ, శైలిలోనూ తననుతానుగా మార్చుకున్నానని చెబుతున్న మహేష్‌ బిజినెస్‌మేన్‌ హిట్‌ను బాగా ఎంజారు చేస్తున్నానని చెబుతున్నాడు.

అందుకే కథ వినలేదు

బిజినెస్‌మేన్‌ కథ వినకపోవడమనేది మొండి ధైర్యంకాదు. కథను వినలేదంటే.. దానికి ఓ కారణముంది. అప్పుడు 'దూకుడు' సినిమా పోస్ట్‌ప్రొడక్షన్స్‌ ఆలస్యంకావడం, డబ్బింగ్‌ చెప్పడం వల్ల వినే సమయం దొరకలేదు. పూరీ జగన్నాథ్‌పై పూర్తి నమ్మకం ఉంది. పోకిరి డీల్‌ చేశాడు. దాని ఛాయలు లేకుండా ఉన్నాయని చెప్పడం.. ఇవన్నీ ఆయనపై ఉన్న నమ్మకంతోనే. ఖలేజా సినిమాతో డిఫరెంట్‌ టైప్‌లో చేయవచ్చని నాకు తెలిసింది. ఏ సినిమా అయినా ఇలా ఉండాలి. అలా ఉండాలని రూలేమీ పెట్టుకోను. నేను చేయబోతున్న 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్లు', సుకుమార్‌ చిత్రంకానీ మంచి కథలు అలా కుదిరాయి. ఆ తర్వాత అశ్వనీదత్‌, క్రిష్‌కాంబినేషన్‌లో ఓ చిత్రంలోనూ నటించబోతున్నాను.

డైలాగ్‌లో మార్పు

నేను సినిమాలకు తీసుకున్న గ్యాప్‌లో ఏదో చేయాలని.. ప్రతి సినిమా వేరేగా ఉండాలని.. ఆలోచించాను. ఆ క్రమంలో చాలా విషయాలను ఇతరులనుంచి, నాలోనుంచి నేర్చుకున్నాను. అందుకే ఆ టైమ్‌లో 'దూకుడు' చేశాను. తర్వాత చేసే 'బిజినెస్‌మేన్‌'లో ఆ ఛాయలు లేకుండా కొత్తగా చూపించాం. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్ళకూడదా? అని చాలామంది అడుగుతున్నారు. నాకు తెలుగుసినిమాలు చేయడమంటేనే ఇష్టం. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. యు.ఎస్‌.లోకూడా నాకంటూ కొంత పేరుంది. అక్కడ నా సినిమాలన్నీ హిట్‌ అవుతున్నాయి.

పదిమందికి నచ్చేవే చేయాలి

సినిమాకు 45కోట్లు ఖర్చుపెట్టి చేస్తున్నారంటే.. అది నా డ్రీమ్‌రోల్‌ కోసం చేయడం ఇష్టంలేదు. పదిమందితో కూడిన సినిమా ఇది. ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. అలాగే నాన్నగారి సినిమాలు రీమేక్‌ చేయమని అడుగుతున్నారు. అవి నాకు నచ్చవు. నాన్నగారు చేసినవి గొప్ప సినిమాలు. అవి అలాగే ఉండాలి. శంకర్‌ గారికోసమే '3 ఇడియట్స్‌' చేయాలనుకున్నాను. డేట్స్‌ ప్రాబ్లమ్‌ వల్ల సాధ్యపడలేదు. మణిరత్నం సినిమాకూడా అలానే జరిగింది. అవి చేసి ఉంటే... రెండు బిగ్‌ సక్సెస్‌లు వచ్చేవికావు.

నన్ను ఎవరూమార్చలేదు

నాకు నేనుగా మారాను. పెర్‌ఫార్మెన్స్‌పరంగా కథల ఎంపికలో నాకు నేనుగా మారాను. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఎందుకు చేశానా? అనిపిస్తుంది. సైనికుడు, నాని అలాంటివే... సినిమా కథల ఎంపికలో నాన్నగారి ప్రమేయం ఏమీ ఉండదు. నేనే నిర్ణయం తీసుకుంటాను. నాన్నగారు సైనికుడు చూసి ఇది ఆడదు అన్నారు. 'నాని' చూశాక... ఇది హిట్‌ అయితే పెద్దహీరో అవ్వలేవ్‌. అన్నారు. పోకిరి, దూకుడు, బిజినెస్‌మేన్‌ చూసి ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి.

వర్మమాటలు నమ్మను

రామ్‌గోపాల్‌ వర్మ గొప్ప దర్శకుడు. ముంబైలో 'బిజినెస్‌మేన్‌' షూటింగ్‌ జరుగుతున్నప్పుడు చాలాసార్లు వచ్చారు. కొన్ని సూచనలు చేశారు. నన్ను అమితాబ్‌కంటే గొప్ప నటుడు అని పొగిడారు. అలాఅని ఆయన చెప్పింది నమ్మను. అమితాబ్‌ లెజెండ్‌. ...కథ సిద్దమయితే వర్మగారితో చేయడానికి సిద్ధమే.

కాంట్రవర్సీలేవు

నేను కాంట్రవర్సీకు దూరం. సింపుల్‌గా ఉంటాను. షూటింగ్‌ అయ్యాక... ఇంటికి రావడం, కుటుంబంతో గడపం చేస్తాను. అందుకే రూమర్స్‌కూ దూరంగా ఉన్నాను.. ఇతర హీరోల ఫంక్షన్లకూడా వెళ్ళాలని పెద్దగా అనిపించదు. నా సినిమాకు ప్రమోషన్‌గా తప్పకుండా హాజరవుతాను.

హీరోలు చేయకూడదు

కాలేజీడేస్‌నుంచి సిగరెట్‌ అలవాటుంది.. ఆమధ్య 'టు ఈజీ స్టాప్‌ స్మోకింగ్‌' అనే పుస్తకం చదివాక... సిగరెట్‌ తాగడం వల్ల ఎంత అనర్థమే తెలుసుకున్నాను. అప్పటినుంచి సిగరెట్లు మానేశా. నా సినిమాల్లోకూడా స్మోకింగ్‌ సీన్స్‌ ఉండవు. బిజినెస్‌మేన్‌లో స్మోకింగ్‌ సీన్‌లేకుండా జగన్‌ జాగ్రత్తపడ్డారు. ఒక వేళ ఆ సీన్‌పెడితే ఆ పాత్రకు న్యాయం జరగదు. నా సినిమానేకాదు. ఇతర ఏ హీరో అయినా అలా తాగితే.. అది పదిమంది ఆచరించే ప్రమాదముంది... అందుకే యాడ్స్‌కూడా సెలక్ట్‌చేసుకుని చేస్తున్నాను. అని చెప్పారు.

No comments:

Post a Comment