సినిమాలంటేనే ఎఫైర్లతో ముడిపడి ఉంటాయి. హీరో-హీరోయిన్ చనువుగా నాలుగైదుసార్లు ఏ ఫంక్షన్లలోనో, పార్టీల్లోనో కనబడ్డారే అనుకోండి.. ఇక వారిపై పుంఖానుపుంఖాలుగా వార్తలు తిరుగాడటం మొదలవుతుంది. ఇటువంటి పుకార్లు ఇప్పుడు మరింత ఎక్కువైపోయాయి.
తెలుగు వెండితెరపైకి కుర్రహీరోలు, హీరోయిన్ల తాకిడి ఇటీవల కాలంలో ఎక్కువై పోవడంతో లింకుల తాలూకూ వార్తలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఇదివరకు ఓ హీరోయిన్ హీరోతో కనీసం ఓ అరడజను చిత్రాల్లో కలిసి నటిస్తే ఇటువంటి టాక్‌ను సృష్టించేవారు. ముఖ్యంగా ఇటువంటి గుసగుసలు కలర్ ఫిల్మ్స్ వచ్చిన తర్వాతే మొదలయ్యాయి.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తరం హీరోల్లో నాగ్ బాలీవుడ్ హీరోగా కూడా తెరంగేట్రం చేశాడు. బాలీవుడ్ అంటేనే గాసిప్ ప్రపంచం. దీంతో అక్కడకు వెళ్లిన నాగ్‌ను ఆ గాసిప్స్ అలాగే టాలీవుడ్ వరకూ పట్టుకుని వచ్చాయేమో తెలియదు కానీ, ఆ తర్వాత నాగ్‌తో లింకులు పెడుతూ పలు వార్తలు షికారు చేసేవి. బాలీవుడ్ హీరోయిన్ టబుతో సన్నిహితంగా ఉన్నారన్న వాదన చాన్నాళ్లూ టాలీవుడ్‌లో తిరుగాడింది.
మొత్తమ్మీద యువసామ్రాట్ నాగార్జున అంటే మాత్రం చాలామంది హీరోయిన్లకు అదో రకమైన క్రేజ్. దీనికి కారణాలు చాలానే ఉండొచ్చు. ఫ్రెండ్లీగా మాట్లాడటం, కెరీర్ ఆరంభంలో ఉన్నవారికి ధైర్య వచనాలు చెప్పి నిలదొక్కుకునేలా చేయడం, ఒకటి రెండు సినిమాలకు సిఫార్సులు చేయడం వంటివేమైనా ఉండవచ్చు. ఏదేమైనా తమకు మాత్రం నాగ్ చాలా చాలా సహాయసహకారాలు అందించారని చెపుతుంటారు ఆయనంటే క్రేజ్ ఉన్న హీరోయిన్లు.
No comments:
Post a Comment