Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Wednesday, June 1, 2011

"వీర" - "దుశ్శాసన" - "వైకుంఠపాళి" తేలిపోతున్నాయట


రవితేజ నటించిన 'వీర' చిత్రం కలెక్షన్లు "ఎ" క్లాస్‌ సెంటర్లలో డల్‌గా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో చిత్రం ఓపెనింగ్స్‌ తర్వాత క్రమేణా మందగించాయని పలువురు ఎగ్జిబిటర్లు తెలియజేస్తున్నారు. "బి" సెంటర్లలో కాస్త ఫర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. 

ఇటీవలే రిలీజైన పోసాని కృష్ణమురళి 'దుశ్శాసన' మాత్రం పక్కా మాస్‌ పాయింట్‌తో తీశారు. డైలాగ్‌లు ఎక్కువగా ఉన్న ఈ చిత్రం కాస్త నస పెట్టినట్లుందని ప్రేక్షకులు కామెంట్‌ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఇచ్చిన థియేటర్లన్నీ 3వతేదీ నుంచి ఖాళీ అవుతున్నాయి. 

దీనితోపాటు రిలీజ్‌ అయిన అజయ్‌, కృష్ణుడు నటించిన 'వైకుంఠపాళి' చిత్రం మరీ డిజాస్టర్‌గా ఉంది. తొలిరోజే కలెక్షన్లు లేవు. రెండో రోజుకు చూసేవాడు కరువయ్యాడు. దాంతో ఆ చిత్రాన్ని తీసేసి తమిళ డబ్బింగ్‌ చిత్రాన్ని వేస్తున్నారు. దీన్నిబట్టి గతవారం విడుదలైన చిత్రాల పస ఏమిటో తెలిసిపోయింది.

No comments:

Post a Comment