
తన అందచందాలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెల్లపిల్ల తాప్సీ తన చెల్లెలైన షాగన్‌ను మాంచి సినిమాలో నటింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సినీవర్గాలు కోడై కూసాయి. దీనికోసం తాప్సీ అగ్రనిర్మాతలు, దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇంకా సోలో హీరోయిన్ సినిమాలో తాప్సీ చెల్లెలు షాగన్ నటించబోతున్నట్లు కూడా వార్తలొచ్చాయి.
కానీ ఈ వార్తలపై స్పందించిన తాప్సీ అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఇంగ్లీష్‌లో హానర్స్ డిగ్రీ చేస్తుందని చెప్పింది. కాగా, అందాల సుందరి తాప్సీ ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా వస్తున్న "మొగుడు" సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతోంది.
No comments:
Post a Comment