Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, June 3, 2011

కన్‌ఫ్యూజన్‌లో బద్రినాథ్ పబ్లిసిటీ


విక్టరీ వెంకటేష్ తరహాలో అల్లు అర్జున్ ఎటువంటి రోల్ చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇటువంటి ఇమేజ్ ఒక వరం లాంటిది. ఈ ఇమేజ్ ను కాదనుకొని, ఒక మాస్ ఇమేజ్ కోసం అల్లు అర్జున్ ప్రయత్నాలు చూస్తుంటే ఏమి కామెంట్ చెయ్యాలో తెలియడం లేదు. బద్రినాథ్ పబ్లిసిటీ తీరు చూస్తుంటే సినిమాకు వారు ఆశీంచినంత హైప్ రావడం లేదనిపిస్తుంది.
1) అల్లు అర్జున్ బ్యాడి ఎక్సపొజింగ్ స్టిల్స్
2) అల్లు అర్జున్ డాన్స్ తో కూడిన ట్రైలర్స్
3) వి.వి.వినాయక్ ను హైలట్ చేస్తూ కొన్ని స్టిల్స్
4) హిరోయిన్ ఎక్సపొజింగ్ స్టిల్స్

పబ్లిసిటీ అంటే “మా సినిమా నుంచి ఇవి ఆశీంచండి” అంటూ పేక్షకులను సిద్ధం చేయడం – రాజమౌళి
అల్లు అర్జున్ సినిమాల పబ్లిసిటీ చాలా బాగా వుంటుంది. దానికి కారణం ఒక నిర్మాత కొడుకుగా ఒక నిర్మాత కష్టాలు తెలిసి, పబ్లిసిటీ విషయంలో నిర్మాతకు చాలా సహకరిస్తూ వుంటాడు. కాని ఆ పబ్లిసిటీ ప్రేక్షకులను ప్రిపేర్ చేయడానికి కాకుండా, పూర్తి వ్యాపారాత్మకంగా సాగుతుండటం విచారకరం.
బద్రినాథ్ పబ్లిసిటీ చూస్తుంటే మాత్రం “వరుడు” పబ్లిసిటీ గుర్తుకు వస్తుంది. “వరుడు” సినిమా పబ్లిసిటీ అబ్జర్వ్ చేసినట్టయితే రాజమౌళి చెప్పిన నిర్వచనానికి పూర్తి భిన్నంగా జరిగింది. ఒక యాక్షన్ సినిమాను ఒక ఫ్యామిలీ డ్రామాగా పబ్లిసిటీ చేసారు. అదే తరహాలో బద్రినాథ్ పబ్లిసిటీ కూడా సాగుతుందనిపిస్తుంది.
ఈ కన్‌ఫ్యూజన్‌ పబ్లిసిటీ వలన బద్రినాథ్ ఏ తరహా సినిమానో , సినిమాకు ఎందుకు వెళ్ళాలో ఇప్పటి వరకు అర్ధం కాలేదు. సినిమా బాగుందని టాక్ వస్తే చూడోచ్చులే అని అనిపిస్తుంది తప్ప, ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని అనిపించడం లేదు.. ఇటువంటి భారి సినిమాకు చేయవలసిన పబ్లిసిటీ మాత్రం కాదు.

No comments:

Post a Comment