కొత్త చిత్రంలో ఒక పాత్రను పోషించేటపుడు దానికి కళాత్మక విలువలు ఉంటే టాప్‌లెస్‌గా నటించడంలో ఎలాంటి తప్పులేదని బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ అభిప్రాయపడుతోంది. బాలీవుడ్‌లో సంప్రదాయ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. టాప్‌లెస్‌గా నటించేందుకు తాను సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్ సెక్సీనటి సిల్క్‌స్మిత జీవిత కథతో తెరకెక్కుతున్న "డర్టీ పిక్చర్" అనే చిత్రంలో ఈ అందాల బొమ్మ ప్రధాన పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. ఈ పాత్రలో నటించేందుకు అంగీకరించడంతోనే టాక్ ఆఫ్ ది బాలీవుడ్ ఇండస్ట్రీగా మారారు.
తాజాగా టాప్ లెస్ స్టేట్‌మెంట్‌తో అక్కడ మళ్లీ పెను దుమారాన్ని సృష్టించారు. మితిమీరిన ఎక్స్‌పోజింగ్ కన్నా, నగ్నంగా నటించడంలో తప్పేమీ లేదంటూ ఘాటైన ప్రకటనలు ఇస్తూ మీడియాను తన వైపుకు తిప్పుకుంది.
తన ప్రకటనలు రుజువు చేసేలా ఇటీవల ఒక టాప్ లెస్‌గా (వీపు భాగం కనిపించే విధంగా) కనిపించే వాణిజ్య ప్రకటనలో కూడా నటించింది. అలా నటించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని మీడియా అడిగిన ప్రశ్నకు విద్య సమాధానమిస్తూ.. పాత్ర కోసం ఎంతటి త్యాగానికైనా నటి వెనుకాడకూడదు.
తాను మాత్రం ఒక పాత్రను ఇష్టపడితే… ఆ సినిమాలో కళాత్మక విలువలుంటే, పూర్తిగా టాప్ లెస్‌గా కనిపించడానికి కూడా వెనుకాడను. ఇలా నటించినా.. ఆ సన్నివేశాలను సెన్సార్ వాళ్లు విడుదల చేయరని అందుకే వారి అనుమతి కావాలంటూ చిలకపలుకులు పలికింది.
కళాత్మక విలువల కోసం బాలీవుడ్ సుందరాంగులనే ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పలు హాలీవుడ్ సినిమాల్లో సన్నివేశానికి తగినట్టుగా హీరోయిన్లు పూర్తి న్యూడ్‌గా కనిపిస్తారు కదా ప్రశ్నించారు. అందుకని వాటిని వల్గర్ సినిమాలు అనలేం కదా అంటోంది.
తాము ఏం చెప్పాలనుకున్నారో అది రాఖండిగా చెబుతారు కాబట్టే అక్కడ నేటికీ గొప్ప సినిమాలు వస్తున్నాయి. మనలో కూడా మార్పు రావాలి విద్యాబాలన్ సలహా ఇస్తోంది. ఎంతైనా ప్రాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎక్కడికి పోతుంది.
No comments:
Post a Comment