Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Monday, July 25, 2011

జెనీలియాకు ఒక్కసారి చాలదట.. రెండుసార్లు కావాలట



అవ్వటానికి సినిమావాళ్ళయినా, జెనీలియా, రితేష్‌ల లవ్‌స్టోరీ మాత్రం సీరియల్‌గా సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంది. మధ్యలో రెండుసార్లు పెళ్ళి చేసేసుకుంటున్నారని వార్తలొచ్చాయి. ఐతే రితేష్‌ ఫ్యామిలీకున్న క్యాస్ట్‌ ఫీలింగ్‌వల్ల జెనీలియాను కోడలుగా అంగీకరించలేకపోయారు.

అయితే సినిమాల్లోని క్లైమాక్స్‌లా కుమారుని సుఖసంతోషాలే ముఖ్యమనుకున్న ఫ్యామిలీ మెంబర్స్‌ వీరి పెళ్ళికి ఇప్పుడు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. వచ్చే సంవత్సరం ఈ తంతు జరగొచ్చు. దీనికోసం ముందుగానే ప్లానింగ్‌ వేసుకున్నారు ఈ ప్రేమికులు. రితేష్‌ వాళ్ళ ఆచారం ప్రకారం మహారాష్ట్రీయుల సాంప్రదాయ తరహాలో ఒకసారి, జెనీలియా వాళ్ళ ఆచారం ప్రకారం క్యాథలిక్‌ల తరహాలో మరోసారి, ఇలా రెండుసార్లు పెళ్ళి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇలా ఎవరి ఆచారాలను వారు గౌరవిస్తూ, సమన్యాయాన్ని పాటిస్తూ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేసుకున్న వీరు, సంసారం కూడా అదే తరహాలో చేస్తారా, లేదా అనే విషయాన్ని పక్కన బెడితే ఈ మధ్యకాలంలో వీరిద్దరికీ విజయాలు లభించడం లేదు. మరోవైపు జెన్నీ ఈమధ్య చేసిన ఓ యాడ్‌ ఫిలిం వివాదాస్పదమైంది. సో బ్యాడ్‌టైమ్‌ నడుస్తున్న వీరిద్దరు కలిస్తే ఏదైనా రాలుద్దో లేదో చూడాలి...!

No comments:

Post a Comment