Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, June 3, 2011

నందమూరి సమీరా రెడ్డి మళ్లీ ????



జూ ఎన్టీఆర్ కీ,సమీరా రెడ్డికీ మధ్య ఒకప్పుడు ఎఫైర్ వార్తలు బాగానే  విన్పించాయి అశోక్, నరసింహుడు సినిమాలో జూ ఎన్టీఆర్ సరసన సమీరా రెడ్డి నటించింది. నందమూరి సమీరా రెడ్డి..అంటూ జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ సినిమా కార్యక్రమంలో సమీరా రెడ్డి చూస్తూ నినాదాలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్యా పెద్ద గ్యాప్ వచ్చేయడం..టాలీవుడ్ లో ఆమె మళ్ళీ కనిపించకపోవడం తెల్సిన విషయాలే.చాలా కాలం తర్వాత మరో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించనుందట..అదీ నందమూరి అందగాడు ఎన్టీఆర్ తోనేనని సమాచారం.జూ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఊసరవెల్లి సినిమాలో సమీరా రెడ్డి నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సమీరా రెడ్డి హీరోయిన్ కాదనీ, ఓ స్పెషల్ సాంగ్ లో కన్పించనుందనీ సమాచారం.

No comments:

Post a Comment