
తెలుగులో దీక్షకు అంతగా కలిసి రాకపోవటంతో, తమిళ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. విక్రమ్‌తో కలిసి ఓ సినిమా చేస్తోంది. లేటెస్ట్‌గా శింబుతో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నది. రూ.40 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో దీక్షా అన్ని కాస్ట్‌లీ డ్రెస్‌లను, గాడ్జెట్స్‌ను వాడనుందట.
నిజజీవితంలో తను ఎలాగైతే ఉండాలనుకుంటున్నదో, అలాంటి అమ్మాయిగా ఈ సినిమాలో కన్పించనున్నానని బడాయి పోతోంది. శింబులాంటి యంగ్ హీరోతో రొమాన్స్ చేసే అవకాశం రావటం ఎగ్జైటింగ్‌గా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ అవకాశాన్ని తను వందశాతం వినియోగించుకుంటానంటోంది.
మరోపక్క తెలుగు హీరోలు కూడా దీక్షను వదులుకోవటానికి ఇష్టపడటం లేదు. ప్రస్తుతం మనోజ్, రవితేజ తమ సరసన దీక్షనే హీరోయిన్‌గా పెట్టాలని నిర్ణయించుకోవటంతో, మరో రెండు సినిమాలు ఆమె చేతిలోకి వచ్చాయి
No comments:
Post a Comment