Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, June 7, 2011

నయనతారతో వేగేదెట్టా...?: డైలమాలో ప్రభుదేవా


నయనతార మోజులో పడి భార్యను ఖాతరు చేయకుండా కాలర్‌ ఎగరేసిన ప్రభుదేవా పరిస్థితి డైల్‌మాలో పడినట్లు సమాచారం. మొదటి భార్యను వీడవద్దని అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కూడా సలహా ఇచ్చారు. కానీ గడ్డం ప్రభుదేవా అవేమీ పట్టించుకోలేదు. 

ప్రస్తుతం నయనతార కుటుంబం ప్రభుదేవాకు కొన్ని రూల్స్ పెట్టిందట. క్రైస్తవ మతాచారం ప్రకారం పెళ్లి జరగాలనీ నయనతార బంధువులు ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 

బోల్డంత కెరీర్‌ ఉన్న తమ అమ్మాయిని పెండ్లి తర్వాత రూల్స్‌ పెట్టి చట్రంలో బంధించకూడదనేది మరో ప్రధానమైన డిమాండ్‌గా ఉన్నదట‌. దీంతో ప్రభుదేవాకు ఏం చేయాలో తెలియక డైలామాలో పడినట్లు సమాచారం. ఏదైనా వేడిలోవేడి జరిగిపోతేనే బాగుండేదనీ, గ్యాప్ వచ్చేసరికి నయన ఫ్యామిలీ ఇలాంటి కండిషన్లు పెడుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

నయన తనకు మనశ్శాంతి ఇచ్చిందని చెప్పుకున్న ప్రభుదేవా ఇప్పుడు ఆమెకోసం ఆస్తులన్నింటిని త్యాగం చేయాలని చూస్తున్నాడట. ఇదిలావుంటే లేటెస్ట్‌గా ఈ గడ్డం ప్రభు తెల్లపిల్ల హన్సికతో మహాక్లోజ్‌గా మూవ్ అవుతున్నాడని కోలీవుడ్ సినీజనం ఒహటే చెప్పుకుంటున్నారు. మరి ముందుముందు ఏమి జరుగుతుందో 

No comments:

Post a Comment