Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Monday, June 20, 2011

ఉపాధ్యాయుని పాత్రలో నవ్వుల "రాజేంద్రుడు"


WD
లేడీస్‌టైలర్‌, ఆప్పుల అప్పారావు, పేకాట పాపారావు, క్విక్‌గన్‌ మురుగన్‌.. ఇలా డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ అంటేనే వైవిధ్యం. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పరకాయప్రవేశం చేయడం ఆయనలోని విశిష్టత. తాజాగా నారాయణరావు మాస్టారుగా అలరించడానికి సరికొత్త అవతారమెత్తారు నవ్వుల డాక్టర్‌. 

సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో కె. క్రాంతి మాధవన్‌ రూపొందిస్తున్న తాజా చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ ఈ పాత్రను పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల్లో రాజేంద్రప్రసాద్ సహా దర్శకుడు క్రాంతిమాధవ్‌, కథారచయిత తమ్ముడు సత్యం, మాటల రచయిత మరుధూరి రాజా, ఛాయాగ్రాహకుడు హరి అనుమోలు, సీనియర్‌ నటుడు గిరిబాబు, రమేష్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

మాస్టారుపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి రమేష్‌ప్రసాద్‌ క్లాప్‌ ఇవ్వగా, స్రవంతి రవికిషోర్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. గిరిబాబు దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, తండ్రి, తాత, బాబాయ్‌ ఇలా ఎన్నో పాత్రలు జీవితంలో చూస్తుంటాం. గురువుపాత్ర వేరు. ఆ నలుగురులో తండ్రి పాత్ర పోషించాను. అక్కడ షేడ్‌వేరు. ఈ చిత్రంలో గురువుగా కనిపిస్తాను. ఈ యాంగిల్‌ కొత్తది. సంఘంలో టీచర్‌కుండే గౌరవం వేరు. ఎందుకంటే ఎందరో గొప్పవాళ్ళను తీర్చిదిద్దుతాడు. జీవితంలో మర్చిపోలేని పాత్ర ఇది. కథ, డైలాగ్స్‌ బాగా నచ్చాయి అన్నారు. 

దర్శక నిర్మాత మాట్లాడుతూ, నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ చేస్తున్నాం. రాజోలు, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ఉంటుందని అన్నారు.

No comments:

Post a Comment