హీరోయిన్లు అవార్డు ఫంక్షన్లకు రావడం లేదని గతంలో దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలను యువహీరో, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ తప్పుబట్టారు. దాసరి హీరోయిన్లను తప్పుగా అర్థం చేసుకున్నారని చురక అంటించారు.
అవార్డు మంచిదైతే హీరోయిన్లు తప్పకుండా వస్తారని అన్నారు. గతంలో జరిగిన 2010 ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఫంక్షన్‌కి హీరోయిన్లంతా రావడాన్ని తాను చూశానన్నారు. 58వ ఐడియా ఫిల్మ్‌ఫేర్ అవార్డు సంబంధించి హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచరణ్ పైవిధంగా స్పందించారు.
కాగా గతంలో రవీంద్ర భారతిలో జరిగిన వంశీ టాలీవుడ్ అవార్డు వేదికలో దాసరి నారాయణ రావు హీరోయిన్‌లపై విరుచుక పడ్డారు. మంచి మంచి అవార్డు ఫంక్షన్‌లకు హీరోయిన్‌లు హాజరు కావడం లేదనీ, డబ్బులు ఇస్తే షాపింగ్ మాల్స్, పబ్స్, క్లబ్స్‌కి వెళ్లే హీరోయిన్‌లు అవార్డు ఫంక్షన్లకి మాత్రం రావడం లేదని అప్పట్లో ధ్వజమెత్తారు.
వారిని ఇక ఏ అవార్డు ఫంక్షన్‌కి పిలువ వద్దని అన్నారు. దాసరి వ్యాఖ్యలకు రాంచరణ్ తేజ తాజాగా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. మరి రాంచరణ్ తేజ వ్యాఖ్యలపై దాసరి నారాయణరావు ఎలా స్పందిస్తారో చూడాలి.
No comments:
Post a Comment