Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Wednesday, June 1, 2011

సెల్‌ఫోన్లతో బ్రెయిన్ క్యాన్సర్: డబ్ల్యూహెచ్ఒ హెచ్చరిక


మొబైల్ ఫోన్ వినియోగదారులకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఇయర్ ఫోన్స్ వాడటం ఒక్కటే పరిష్కార మార్గమని వెల్లడించింది. 

మొబైల్ పరికరంలో ఉన్న రేడియోఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమేగ్నటిక్ ఫీల్డ్స్ వల్ల మెదడుకు క్యాన్సర్ వచ్చే అవకాశమున్నట్లు "ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్" వెల్లడించింది. 

సెల్ ఫోన్లను అదేపనిగా ఉపయోగించే వినియోగదారులపై సుదీర్ఘమైన పరిశోధనలు చేసిన అనంతరం వారి మెదడుపై చూపే ప్రభావాన్ని కనుగొన్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కూడా తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. 

పదేళ్లపాటు రోజుకి 30 నిమిషాలు క్రమం తప్పకుండా సెల్ ఫోన్ వినియోగించేవారిలో బ్రెయిన్ క్యాన్సర్ తలెత్తే అవకాశం పుష్కలంగా ఉన్నదని వారు హెచ్చరించారు. ఎన్ని హెచ్చరికలు చేసినా సెల్ ఫోన్ వినియోగదారులు మాత్రం తమ చెవుల్లోనే పొద్దస్తమానం సెల్‌ను పెట్టుకుని మాట్లాడటం కనిపిస్తూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలోనైనా హెడ్‌ఫోన్స్ సాయంతో సెల్ ను ఉపయోగిస్తే మంచిది.

No comments:

Post a Comment