Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Thursday, January 26, 2012

మహేష్ బాబుకు సపోర్టుగా బ్రహ్మానందం


విక్టరీ వెంకటేష్- సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. వెంకటేష్ సరసన అంజలి, మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్లుగా నటిస్తుండగా..శ్వేతాబసు ప్రసాద్ హీరో చెల్లెలి పాత్రలో, జయసుధ, ప్రకాష్ రాజ్ మరో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక టాలీవుడ్ టాప్ కామెడీ స్టార్ బ్రహ్మానందం ఈ సినిమాలో పోషించబోయే పాత్ర గురించి కొన్ని విషయాలు బయటకు లీక్ అయ్యాయి. వెంకటేష్ ఇందులో పేకాటకు బానిసైన వ్యక్తిగా, మహేష్ బాబు ఇంటి పరిస్థితులను చక్కబెట్టే పాత్రలో కనిపిస్తాడని, బ్రహ్మానందం మహేష్ బాబుకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండే క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని అంటున్నారు. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది.

వెంకటేష్ పై వైజాగ్‌లో పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు. హీరోయిన్ సమంతపై ఫిల్మ్ నగర్లోని జగపతిబాబు ఇంట్లో సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం అయింది. మహేష్ బాబు ఫిబ్రవరి 9 షూటింగులో జాయిన్ కానున్నాడు.

No comments:

Post a Comment