Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Saturday, January 28, 2012

సుకుమార్ నిజ జీవిత పాత్రలో మహేష్!?



సుకుమార్, మహేష్ బాబుల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో మహేష్ కాలేజీలో లెక్చరర్ గా కనపిస్తారు. సుకుమార్ తన దైన శైలిలో కాలేజి సీన్స్ రాసుకున్నారని వినపడుతోంది. అయితే పూర్తి ఫన్ తో కాలేజీ లెక్చరర్ కీ,స్టూడెంట్స్ కీ మధ్య నడిచే కథతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు. సుకుమార్ గతంలో లెక్చరర్ గా చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం సుకుమార్ జీవింతంలోంచి వచ్చిన సన్నివేశాలతో రూపొందుతోందని చెప్పుకుంటున్నారు. అదే ప్లేవర్ లో ఈ చిత్రం ఉండబోతోందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయిందని, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పుల్ ఫ్లెజ్డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలుస్తూంది. ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. 

మహేష్ బాబు ఇదివరకెన్నడూ కనిపించని విధంగా కొత్తలుక్ తో లెక్చరర్ గా కనిపించబోతున్నాడు. ఈ సంవత్సరంలో విడుదలై భారీ విజయం సాధించిన దూకుడు సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపిచంద్ ఆంచటలు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 2012 జనవరి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

No comments:

Post a Comment