Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

తోలుకప్పుకున్న ఎముకల ఇలియానా?


పోకిరి సినిమాలో ఇలియానా అందాలు చూసి చాలా మంది ఆమెకు అభిమానులు అయిపోయారు. సొగసైన నడుము, అందమైన ముఖార విందానికి తోడు, మంచి ఫిజిక్ తో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. ఆ సినిమా తర్వాత కొంత మంది యువతులు సైతం ఇలియానాలా తయారవ్వాలని చాలా వర్కౌట్లు చేశారు. అయితే తాజాగా ‘స్నేహఇతుడు’ సినిమాలో ఆమెను చూసిన చాలా మంది ఇలియానా అంద విహీనంగా ఉందని, బాగా బక్కచిక్కిపోయి తోలుకప్పుకున్న ఎముకల గూడులా తయారైందని అంటున్నారు.

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విడుదలైన ‘స్నేహితుడు’ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. శంకర్ బ్రాండ్ సినిమా, ఇలియానా అంద చందాలు అన్న రెండు పాయింట్ల కారణంగానే ప్రేక్షకులను థియేటర్ల వైపు లాగింది. అయితే అందరికీ నిరాశ తప్పలేదు. ఈ సినిమా ఇప్పటికే వచ్చిన 3 ఇడియట్స్ సినిమాకు జిరాక్స్ కాపీ కావడం, ఇలియాన కూడా స్కెల్టన్‌లా తయారవ్వడం చూసి భరించలేక పోయామనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే గతంలో 3 ఇడియట్స్ సినిమా చూడని వారు మాత్రం....సినిమా స్టోరీలైన్ బాగుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment