Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, July 19, 2011

ఇంకెన్నాళ్ళు

'ఇంకెన్నాళ్ళు' ఎదురుచూపులు ఈ తెలంగాణా కోసమంటూ...దర్శక నిర్మాత రఫీ అంటున్నాడు. ఇటీవలే 'మిస్టర్‌ రాహుల్‌ ఫర్‌ఫెక్ట్‌' అనే చిత్రాన్ని ఆయన నిర్మించారు. ప్రస్తుత చిత్రానికి 'ఇంకెన్నాళ్ళు తెలంగాణా బలిదానాలు' అనే పేరు నిర్ణయించారు. ఈ చిత్ర విషయాలను తెలియజేస్తూ...'విద్యార్థులు ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారు. బలిదానాలకూ గురవుతున్నారు. రాజకీయనాయకులెవ్వరూ చనిపోలేదు. సమాజంలో చెడు పెరిగిపోయింది. మాకు అవినీతి లేని తెలంగాణా కావాలి. స్వచ్ఛమైన తెలంగాణను సినిమా ద్వారా చెప్పదలిచాం. శ్రీకృష్ణ కమిషన్‌ వేయగానే తెలంగాణ వస్తుందనే అనుకున్నాం. అంతకుముందే ఈ టైటిల్‌ను రిజిష్టర్‌ చేశాం. నలభైరోజులపాటు తెలంగాణలోని కళాకారులతో సినిమా నిర్మించాం. జెఎసీ నాయకులంతా సహకరించారు. తెలంగాణ పోరాటంలో 20 వేల కుటుంబాలు పాలుపంచుకున్నాయి. ఈమధ్య కాలంలో 600 మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యమంలో ఈ సినిమాకూడా ఓ భాగం. తెలంగాణ మనోభావాలు, వారిపై జరుగుతున్న దోపిడీ దీనికి సంబంధించిన పరిష్కారం....మొదలైనవి సినిమాద్వారా చెప్పాలనే సంకల్పంతో రూపొందిస్తున్నా' అన్నారు. త్వరలో ఆడియోను విడుదల చేయనున్నామని తెలిపారు.

No comments:

Post a Comment