![](http://www.prajasakti.com/images_designer/article_images/2011/7/18/aptn-1311002238210.jpg)
ఆనాటి 'మనీ' చిత్రానికి సీక్వెల్‌గా భావించొచ్చు. బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించారు. జెడి.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కింది. ఫస్ట్ ఛాయిస్ మీడియా హౌస్ బ్యానర్‌పై కె.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. లోగో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు, నటుడు జెడీ మాట్లాడుతూ... 'బ్రహ్మానందం ఈ చిత్రానికి కీలకం. కొత్త కొత్త డాన్స్‌లుకూడా చేశాడు. దొంగలముఠా ఆయన ఇంటికి రావడం.. ఆ తర్వాత అనుకోకుండా మరికొంతమంది అతిథులు రావడం... ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించామన్నారు. త్వరలోనే ఆడియోను విడుదలచేసి, సినిమానూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ...'మనీలో చేశాను. అటువంటి పాత్ర మళ్ళీ చేయడం కష్టమైనా, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిత్రాన్ని జెడీ చక్రవర్తి అద్భుతంగా మలిచారు' అని చెప్పారు. ఇంకా భరణి, రాజీవ్‌కనకాల, మయూరి, సెంథిల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: భరణి కె. ధరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: భాస్కర్.
No comments:
Post a Comment