జగపతిబాబు, ప్రియమణి, శ్యామ్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం 'క్షేత్రం'. శ్రీ బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై టి.వేణుగోపాల్ దర్శకత్వంలో వస్తోంది. వై.ఎస్.ప్రతాప్‌రెడ్డి సమర్పణలో టి.గోవిందరాజు నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. నిర్మాత విశేషాలు చెబుతూ...'ఇప్పటివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు ఫిలింసిటీలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ చేశాం. ఈనెల 16నుంచి మలేషియాలో రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం. హరీష్‌పారు నృత్య సారథ్యంలో ప్రియమణి, శ్యామ్‌లపై షూటింగ్ జరుపుతున్నాం. ఈనెల 28వరకు జరిగే షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాల తీస్తాం. దీంతో 95 శాతం షూటింగ్ పూర్తవుతుంది. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం' అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ...'చారిత్రక నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రం నేటి ట్రెండ్‌కు తగినట్లే ఉంటుంది. నాగ పెంచలమ్మగా ప్రియమణి, వీరనర సింహారాయలుగా జపగతిబాబు అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టు సాగే కథలో అనుకోకుండా చారిత్రక నేపథ్యంలోకి కథ మలుపు తిరుగుతుంది.' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్కినపల్లి విజరుకుమార్.
No comments:
Post a Comment