Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

మొగుడు వద్దంటోన్న హీరోయిన్..


మొగుడు వద్దంటోన్న హీరోయిన్..మరో ఏడేళ్ల

మరో ఏడేళ్ల వరకు పెళ్లి, మొగుడు లాంటి సంబంధాలు వద్దంటోంది హీరోయిన్ ఆసిన్. చెన్నయ్ కి చెందిన ఓ పారిశ్రామిక వేత్తతో ఆసిన్ ఎఫైర్ నడుపుతోందని, తర్వలో అతనితో పెళ్లికి సిద్ధం అవుతోందని, మరికొన్ని రోజుల్లో పెళ్లి వివరాలు అధికారికంగా ప్రకటిస్తారని గాసిప్ప్ వినిపిస్తున్న నేపథ్యంలో........అసిన్ మీడియాతో మాట్లాడుతూ తనకు మరో ఏడేళ్ల వరకు పెళ్లి చేసుకోవాలని లేదని, తన దృష్టి అంతా సినిమా కెరీర్ పైనే ఉందని, పుకార్లను నమ్మవద్దని జవాబు ఇచ్చింది. ప్రస్తుతం నా వయస్సు 26 సంవత్సరాలు మాత్రమే, పూర్తిగా స్థిర పడ్డతర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని తెగేసి చెప్పింది.

ఆసిన్ ఇటీవలి కాలంలో ఏ దక్షిణాది సినిమాలు ఒప్పుకోలేదు. బాలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వస్తుండటంతో....ముంబైలోనే ఎక్కువగా గడుపుతోంది. ప్రస్తుతం ఆసిన్ అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న ‘హౌస్ ఫుల్ 2’, అభిషేక్ బచ్చన్ హీరోగా రూపొందుతున్న ‘బోల్ వచ్చన్’ సినిమాలో నటిస్తోంది. అసిన్- సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన రెడీ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment