కింగ్ నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు వంటి అద్భుత చిత్రాల్ని అందించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇప్పుడు 'శిరిడిసాయి' అనే దృశ్యకావ్యం రాబోతోంది.
శిరిడి సాయిగా నాగార్జున నటిస్తున్న ఈ చిత్రాన్ని సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై శ్రీమతి సులోచనారెడ్డి సమర్పణలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ భక్తిరస చిత్రానికి సంబంధించి పాటల రికార్డింగ్ పూర్తయింది.
నాగార్జున, కె.రాఘవేంద్రరావు, ఎం.ఎం.కీరవాణిల అపూర్వ కలయికలో మరో గొప్ప మ్యూజికల్ హిట్‌గా 'శిరిడిసాయి' రాబోతోంది. ఫిబ్రవరి 2న కర్ణాటకలోని ఓ మారు మూల గ్రామంలో షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ చిత్రం తాజా షెడ్యూల్ 25 రోజులపాటు అక్కడ జరుగుతుంది.
'శిరిడిసాయి' గురించి నాగార్జున మాట్లాడుతూ - ''ఇంతకుముందు అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తుడి పాత్రలు పోషించాను. ఇప్పుడు భగవత్ స్వరూపుడు శిరిడిసాయి పాత్ర పోషించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా నట జీవితంలో ఈ 'శిరిడిసాయి' మరపురాని చిత్రం అవుతుంది. అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల తర్వాత రాఘవేంద్రరావుగారితో చేస్తున్న మరో గొప్ప చిత్రం ఇది. ఈ చిత్ర నిర్మాత మహేష్‌రెడ్డిగారు శిరిడిసాయి భక్తులు. మంచి అభిరుచితో శిరిడిసాయి చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు'' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, మాటలు: పరుచూరి బ్రదర్స్, కథా సంకలనం: భక్త సురేష్ డి., కథా సహకారం: పొందూరి హనుమంతరావు, ఫోటోగ్రఫీ: ఎస్.గోపాల్‌రెడ్డి, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, వేదవ్యాస్, సత్తిపండు, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, నిర్మాత: ఎ.మహేష్‌రెడ్డి, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు.

No comments:
Post a Comment