అలనాటి అందాల తార రాధ కుమార్తెగా అరంగేట్రం చేసిన కార్తీకకు అవకాశాలు ఒక్కటంటే ఒక్కటి కూడా రావడంలేదు. గతంలో నాగచైతన్యతో నటించిన ‘జోష్’ చిత్రం బాక్సాఫీసు వద్ద చతికిల పడటంతో ఈ భామ కష్టాలు మరీ ఎక్కువైపోయాయి. అప్పటికీ తల్లి రాధ రంగంలోకి దిగి అనేక మందిని సంప్రదించినా ఎవరూ సరైన అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు. ఇటీవల జీవా హీరోగా విడుదలైన ‘రంగం’ చిత్రం విజయవంతమైంది. ఆ చిత్రంలో కథానాయికగా కార్తీక నటించినా పేరు మాత్రం జీవాకే వచ్చింది. దానితో అతనికి సినిమాలు పెరిగాయి కాని, కార్తీకకు బోణీ కాలేదు. దీనితో యువ హీరోల సరసన నటిస్తేనన్నా గుర్తింపు వస్తుందని రాధ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే ఏ అగ్ర యువ హీరోలు కార్తీక వైపు చూడటంలేదట. కనీసం చోటా మోటా హీరోలు కూడా చూసేందుకు జంకుతున్నారట! హీరోయిన్లు దొరక్క నానా బాధలు పడుతున్న హీరోలు ఒక్కసారి కార్తీకను తీసుకుని చూస్తే ఏవౌతుంది? అని చర్చ కూడా జరుగుతుంది. అయినా కానీ వర్కవుట్ కావడంలేదు. ప్చ్....!
No comments:
Post a Comment