రజనీతో పూరీ బుడ్డా రీమేక్ చేయనున్నాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ యాంగ్రీ మేన్ గా నటించగా, హేమమాలిని, సోనాలీ చౌహాన్, ఛార్మి, రవీనా టాండన్, సోనూ సూద్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించగా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మించబడిన బాలీవుడ్ చిత్రం "బుడ్డా" క్యాప్షన్ "హోగా తేరా బాప్". ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
ఈ "బుడ్డా" చిత్రాన్ని సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ భావిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. అయితే దీనికి రజనీ కాంత్ ఎంతవరకూ అంగీకరిస్తారన్నది ఇంకా తెలియదు. ఒకవేళ రజనీ కాంత్ ఈ "బుడ్డా" చిత్రంలో నటించాలన్నా ముందు "రాణా" చిత్రం పుర్తి కావాలి. అది 2012 లో పూర్తవుతుంది. కనుక రజనీతో పూరీ బుడ్డా రీమేక్ ఒకవేళ మొదలైతే 2012 లో ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment