అన్ని అడ్డంకుల్ని అధిగమించిన ప్రేమ పక్షులు ప్రభుదేవా, నయనతార త్వరలో వివాహం చేసుకోనున్నారు. తమ పెళ్లికి అనువైన ప్రదేశంగా ముంబై నగరాన్ని ఎంచుకున్నారని చెన్నరు వర్గాలు తెలుపుతున్నాయి. కొచ్చిలో వీరు పెళ్లి చేసుకోవాలని మొదట్లో అనుకున్నారు. ఆ తర్వాత చెన్నరు, హైదరాబాద్ నగరాలనూ పరిశీలించారు. అభిమానుల తాకిడి ఉంటుందేమోనని భావించిన ఈ జంట, ముంబై నగరాన్ని ఎంచుకున్నారంట ! ఇక్కడైతే ఎటువంటి ఆటంకాలూ లేకుండా కార్యక్రమం జరుగుతుందని భావిస్తున్నారు.
No comments:
Post a Comment