శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి, మంత్రి రఘువీరా రెడ్డి హీరో నందమూరి బాలకృష్ణపై మంగళవారం వేర్వేరుగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విగ్గు పెట్టుకొని ఎవరో రాసిన డైలాగులు చదివే బాలయ్య సింహంలా ఫీలవుతున్నారని విమర్శించారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బాలయ్య అమ్ముడు పోయారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ను రాజకీయంగా భ్రష్టు పట్టించిన బాబుకు బాలయ్య మద్దతు పలకడం శోచనీయమన్నారు. చంద్రబాబు ఏది చెబితే బాలయ్య అదే మాట్లాడుతారని మరో ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణా రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఆశయం సమైక్యాంధ్ర అని, ఆయన ఆశయాలు బాలయ్య తుంగలో తొక్కారన్నారు.
వందమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా కాంగ్రెసును ఏమీ చేయలేరని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. చిరంజీవికి ప్రజాధరణ ఉందన్నారు. ఎన్టీఆర్ మద్యంపై నిషేధం విధిస్తే మీ బావ బార్ దుకాణాలు బార్లా తెరిచారన్నారు. హార్స్ పవర్ రూ.50కి ఎన్టీఆర్ ఇస్తే బాబు దానిని రూ.600కు చేశారన్నారు. ఆ రోజు తొడకొట్టకుండా, అప్పుడు మీసం మెలేయకుండా బాలయ్య ఏం చేశారని ప్రశ్నించారు. సొంత డెయిరీ కోసం పాల సంఘాలను తొక్కి వేశారన్నారు. చంద్రబాబు ఓ కిరాతకుడన్నారు.

No comments:
Post a Comment