Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, January 27, 2012

బాలయ్య తొడగొట్టంతో.. సాయంత్రానికి ఆయన రెండు తొడలు బాగా వాసిపోతున్నాయట.


మెగా స్టార్ నటించిన .. ‘ఠగూర్’ సినిమాలోని పాటకు బాలయ్య పేరట పాడుతున్నడట. ఠగూర్ సినిమాలో చిరంజీవి , త్రిష జంటగా నటించిన సినిమా . అయితే ఆ సినిమాలో ఒక పాట ‘‘ కొడితే కొట్టాలిరా... సిక్స్ కొట్టాలి, ఆడితే... ఆడాలిరా ... రఫ్ ఆడాలిరా’’. అనే పాటకు బాలయ్య ‘‘ కొడితే కొట్టాలిరా ...బాలయ్యే తోడ కొట్టాలిరా... ఆడితే .. ఆడాలిరా.. బాలయ్యే రఫ్ ఆడాలిరా? ఏదేమైన గానీ .. నా తోడనే కొట్టాలిరా .... అది చరిత్రలో ఒక మచ్చగా నిలిచిపోవాలి.’’ అంటూ బాలయ్య ఇప్పుడు చిరు పాటను వేదికలమీద పాడుతున్నాడట.

తెలుగు భాషను అంతా మరచిపోతున్నరని అలాంటి సమయంలో బాలయ్య నటించిన సినిమాల్లోని డైలాగులను నేటి చిన్నారులు మాట్లాడుతున్నారని బాలయ్య అంటున్నాడట. తెలుగు భాష ఈ రకంగానైనా బతుకుతుండడం బాలయ్యకు అమితానందాన్ని కలిగిస్తోందంటున్నారట. ఆయన సింహా సినిమాలోని 'ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, మాడిమసైపోతావు' అనే డైలాగును అభిమానుల మధ్య వినిపిస్తున్నారట. అంటే ఆయన వల్లే తెలుగుకు బ్రతుకుందని బాలయ్య మీటింగ్ లకు వెళ్లిన అభిమానులు అనుకుంటున్నారు.
ఆయన తన బలం ఎంతో చూపించేందుకు .. ఎక్కడ వేదికలు పెడితే అక్కడ తొడలు కొట్టుకుంటూ... మీసాలు మెలిసుకుంటూ.. చిరు ను పావుగా వాడుకుంటున్నాడట. రాబోయే ఎన్నికల్లో చిరంజీవిపై పోటీ చేయడానికి తాను సిద్ధమేనని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటిస్తున్నాడట. గతంలో.. చిరంజీవి చేసిన పనులను ఫాలో అవుతున్నాడట బాలయ్య అభిమానులే అంటున్నారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మినుములూరు పంచాయతీ బందపొలంలో గిరిజనులతో సహపంక్తి భోజనాలు చేశారట. గిరిజనులతో థింసా నృత్యం చేశారట. మొన్న కాంగ్రెస్ నాయకులు , చిరంజీవి కలిసి చేసిన పనులను మళ్లీ బాలయ్య చేస్తున్నాడని అక్కడున్న గిరిజన ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట.

బాలయ్య అసెంబ్లీకి పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నానన్నారట. బాలయ్య రాష్ట్రలోనే తోడలు కొడతాడట. ఆయన తొడల కొట్టే సౌండ్ దెబ్బకు ప్రజలు భయపడి పరిపోతారో, లేక నిలబడి ఓట్లు వేస్తారో తెలియదని ఆయన కార్యకర్తలు అంటున్నారు. . మూడు దశాబ్దాలపాటు సినీరంగంలో నటుడిగా ఆదరించినట్టే అభిమానులు, ప్రజలు రాజకీయాల్లో కూడా తనను ఆదరిస్తారన్న నమ్మకం బాలయ్యకు ఉందట.

బాలయ్య రాజకీయ ప్రవేశం వ్యూహాత్మకంగా సాగేది కాదని, ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు విజన్ సాధనకే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడని బాలకృష్ణ స్పష్టం చేశారట. అలాగే కార్యకర్తలు, నాయకులు, అభిమానుల నుంచి కూడా ఒత్తిడి వస్తుందట. బాలయ్యకు రాజకీయాలు, సినిమా సమానమని, రెండింటికీ ఒకే విధమైన ప్రాధాన్యం ఇస్తాడట. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారకరామారావు కాదట. బాలయ్య ఎన్టీఆర్ కు కొత్త అర్థం కూడా చెబుతున్నడట. ఎన్ అంటే నటనాలయమని, టి అంటే తారా మండలంలో వెలుగొందిన ద్రువతారని, ఆర్ అంటే రాజకీయ రంగంలో రాజర్షి అంటూ కొత్త భాష్యం చెబుతున్నారట. బాలయ్య చంద్రబాబుల నాయకత్వంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని గట్టిగా చెబుతున్నారట. బాలయ్య, బాబు, జూనియర్ ఎన్టీఆర్ ల అభిమానులు, కార్యకర్తలు వేరు కాదని, అంతా ఒకటేనని బాలయ్య అంటున్నడట. . టీడీపీ గెలుపునకు ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజులై పాటుపడాలని బాలయ్య పిలుపునిస్తున్నారట.

అయితే 1983 నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయంటూ రైతులు పడుతున్న కష్టాలను వివరిస్తూ సాగించిన ప్రసంగానికి మంచి స్పందన లభిస్తుందట. బాలయ్య తుది శ్వాస విడిచే వరకు, చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలు, పార్టీ కోసం శ్రమిస్తానని ప్రకటించుకుంటున్నడట. బాలయ్య సభలో అనేక సార్లు ఆయన తొడగొట్టి అక్కడున్న అందరినీ నిద్రలేపుతున్నాడని .. బాలయ్యతో పాటు సభలో ఉన్న నాయకులు జోకులు వేసుకుంటున్నారట. 

ఏదీ ఏమైన బాలయ్య తొడగొట్టంతో.. సాయంత్రానికి ఆయన రెండు తొడలు బాగా వాసిపోతున్నాయట. ఆ వాపులు తగ్గటానికి కొత్త ఆయిల్ మెంట్స్ రాసుకుంటురని .. తెలుగు దేశం పార్టీ ఆఫీసులో గుసగుసలాడుకుంటున్నారు.

No comments:

Post a Comment